BREAKINGNEWS 🚨🚨

Massive explosion reported in Lutsk, Ukraine

వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన తాడేపల్లిలోని ఇళ్లు కొత్త భవనమే అయినప్పటికీ కిటికీలు, తలుపులుకి రూ.73 లక్షలు




వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన తాడేపల్లిలోని ఇళ్లుకొత్త భవనమే అయినప్పటికీ కిటికీలు, తలుపులుకి రూ.73 లక్షలు





ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన తాడేపల్లిలోని ఇళ్లు, క్యాంపు ఆఫీసుకు కొత్తగా అల్యూమినియం కిటికీలు, తలుపులు అమర్చేందుకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ రోడ్లు భవనాల శాఖ గత నెల్లో ఉత్తర్వులు జారీచేసిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

జగన్‌ ఎన్నికల ముందే ఈ నివాసాన్ని నిర్మించుకున్నారు.ముఖ్యమంత్రి అయ్యాక క్యాంప్‌ ఆఫీసుగా ఉపయోగించుకుంటున్నారు.కొత్త భవనమే అయినప్పటికీ భద్రత దృష్ట్యా కొన్ని గదులకు అల్యూమినియం తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయాలని భావించారు.

జగన్‌ ఇళ్లు, క్యాంపు ఆఫీసులో కొత్తగా ఆల్యూమినియం కిటికీలు, తలుపులు ఇతర సదుపాయాలు కల్పించేందుకు రూ.73 లక్షలు కేటాయిస్తూ అక్టోబరు 15న ఆర్‌అండ్‌బీ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ భవనాల మరమ్మత్తులు,నిర్వహణ,వసతి కల్పన,అభివృద్ధి పథకాల పద్దు కింద నిధులను ఖర్చు చేస్తారు.




ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు ఆయన ఇళ్లు, దాని పరిసరాల్లో అభివృద్ధి, భద్రతా చర్యల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసింది.

Comments